15, ఆగస్టు 2018, బుధవారం

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలెనే ఈ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ, కూని చిన్న చైనా ముందు జాగ్రత్తలతో దిన్ని సులువుగానే అరికట్టవచ్చు. అవేంటో పరిశిలిద్దాం ఇప్పుడు. *1.ప్రతి రోజు నాలుకను శుబ్ర పరచండి* ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగు క్లీనర్ తో శుబ్రపరచడం మరిచిపోవద్దు. రోజంత తినేటప్పుడు వివిధ ఆహార పదార్థాలు చాల రేసిజ్యు ను నాలుకై పై వదులుతాయి, ఇదే ఓవర్ నైట్ పెరుకుపొఇ ఇన్ఫెక్ట్ అయి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. ఇంతే కాక, కడుపులో లొఎ బైల్ రాత్రి పుట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది. అందుచేత నాలుకను శుబ్ర పరచడం తప్పనిసరి. *2.ఆపిల్ లేదా క్యారట్ లను రోజు తినండి.*/ ఆపిల్ లేదా క్యారట్ ను రోజు తినడం వలన పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు క్లీన్ అయ్యి శ్వాశ శుబ్రంగా, తాజా గ ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. సాఫ్ట్ గ, క్రీం లాగా ఉండే ఆహార పదార్థాలు పళ్ళ పై, నాలుక పై అంటుకొని బాక్టీరియా ని పెంచి దుర్వాసనకు దారి తీస్తుంది. ఆహరాల పై ఈ మెలుకువలు పాటించాల్సిందే. *3.కాఫీ కి బదులు గ్రీన్ టీ తాగండి* కాఫీ దుర్వాసనకు ఓక మూల కారణం అనేది జగమెరిగిన సత్యం. అయితె ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం, గ్రీన్ టీ ఓవర్ అల్ ఆరోగ్యాన్నే కాదు, శ్వాస ను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. అందుకే మీ కాఫీ రొటీన్ లను వీలయితే గ్రీ టీ అలవాట్లు గ మార్చుకోండి, మరీనా ఆరోగ్యం,శ్వాస మీరే గమనిస్తారు. 4*కొబ్బరి నునే తో పుక్కులించడం* కొబ్బరి, కొబ్బరి నూనే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో అని తెలిసిందే. అయితే వీటిల్లో శ్వాస ను మెరుగు పరచడం కూడా ఒకటి అన్నది చాల మందికి తెలియదు. కొద్దిపాటి కొబ్బరి నూనేను నోట్లోకి తీస్కోని నాలుగైదు సార్లు పోక్కిలించడం వలన నోట్లోని హనికారక బాక్టీరియా నిర్ములించబడి, పళ్ళ చిగుల్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాలతో మీ శ్వాస ని తాజా గ చేసుకోండి. మి నవీన్ నడిమింటి

చుండ్రు నివారణ

వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడి బారి పోతుంది . పెదవులు , మడమలూ పగలుతూ ఉంటాయి . తలలో చుండ్రు వచ్చును . *గృహ చికిత్సలు* : --- 1.గోరు వెచ్చని నువ్వల నూనెను తలకు + శరీరమంతటికి మర్దన ( మాలీష్ ) చేయవలెను. 1 గంట తర్వాత పెసర పిండీ ( Green Gram Powder ) తో స్నానం చేయ వలెను . 2 .2 or 3 spoon ల మెంతులను1 గ్లాసు నీళ్ళలో రాత్రి నాన బెట్ట వలెను . ఉదయం మెంతులలో + పెరుగు కలుపుతూ పేస్ట్ తయారు చేసుకొన వలెను . నువ్వుల నూనె ను తలకు ( scalp ) కి పట్టిస్తూ 10 నిమిషాల పాటు మర్ధన చేయాలి . ఆ తర్వాత పేష్ట్ ని తలకు బాగా పట్టించాలి . 20 - 30 నిమిషాల తర్వాత *పెసర పిండి ( green gram powder )* తో స్నానం చెయ్యాలి .. గమనిక : --- 1. చుండ్రు కొద్దిగా వున్న వారు , మొదటి పద్ధతి ప్రకారము వారానికి 2 లేక 3 సార్లు చేయడం వలన శరీరంలో వున్న వాతము తగ్గి , పగిలిన పెదవులు , మడమలూ మరియు చుండ్రు తగ్గి పోవును . 2. చుండ్రు ఎక్కువగా వున్న వారు 2 వ పద్దతి ప్రకారము చేయ వలెను. 1 వారము ప్రతి రోజు చేయ వలెను . చుండ్రు తగ్గని యెడల మరల ఇంకొక వారము ప్రతి రోజు చేయ వలెను . అప్పటికి చుండ్రు పూర్తిగా తగ్గి పోవును . వరుసగా 2 వారాలు చేయ లేని వారు . 1 వారము చేసిన తర్వత 1 వారము Gap ఇచ్చి మరల 1 వారము ప్రతి రోజు చెయ్యండి . పూర్తిగా తగ్గే వరకు చెయ్యండి. 3 . చుండ్రు పూర్తిగా తగ్గిన తర్వాత మొదటి పద్ధతి ప్రకారము వారములో ఒక సారి ఖచ్చితంగా చెయ్యండి . పై పద్దతులు ఆచరించన యెడల , మీ వెంట్రుకలు SILKY గా తయారవును . క్రొత్త వెంట్రుకలు వచ్చును . స్వదేశి చికిత్స* *తులసి ( Holy Basil )* హిందూ మతంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి , పూజా విధానాలు ఉన్నాయి . తులసి తీర్ధం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్ధానాన్ని కల్గి ఉంది . దీనిని సర్వరోగ నివారణిగా భావిస్తారు . వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేధంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడు తున్నది . తులసిని చాలా గృహ చికిత్సలలో కూడా వాడుతారు . # తులసిలో ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ , కొంచెం లేత రంగులో ఉండే జాతిని రామ తులసి అనీ అంటారు . *గృహ చికిత్సలు* .... తులసిని వాడే విధానము.. ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం 1 spoon త్రాగవలెను . 10 --15 కృష్ణ తులసి ఆకులను పేష్ట్ లాగా చేసి , రసం తీయవలెను , కొద్దిగా వేడి చేసి + బెల్లం లేక తేనెను కలిపి 1 spoon మోతాదులో తీసుకొనవలెను . ( Or ) 15 -- 20 కృష్ణ తులసి ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి ,1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించి + బెల్లంని కలిపి త్రాగవలెను . *ఫలితములు* ..... 1. Typhoid Fever , Viral Fever , Bacterial Fever మరియు ఎటువంటి జ్వరమైన తగ్గిపోవును . 2. స్త్రీ లలో వచ్చు leucorrhea ( white discharge ) తగ్గిపోవును . (బెల్లం బదులు కండ చెక్కరను కలిపి తీసుకొనవలెను ). 3. వృద్దులలో వచ్ఛు బహుమూత్ర రోగం , కొద్ది , కొద్దిగా వచ్చు మూత్ర రోగాలు తగ్గిపోవును . 4 . స్త్రీలకు నెలసరిలో వచ్ఛే అధిక ఋతుస్రావంని అరికట్టుతుంది . 5 . పిల్లల కడుపులో వుండే నులి పురుగులు తొలగిపోవును . # *DANDRUFF*... కృష్ణ తులసి ఆకుల రసంని తల ( Scalp ) కు పట్టించి , 1 గంట తర్వాత తలస్నానం చేయవలెను . త్వరలోనే DANDRUFF తగ్గిపోవును . *WOUNDS* ... శరీరంలో వ్రణం ఎక్కడైనా వున్నయెడల కృష్ణ తులసి ఆకుల పేష్ట్ ను పూయవలెను . త్వరలో తగ్గిపోవును . *గమనిక* ... కృష్ణ తులసి లో ఎక్కువ ఔషధ గుణాలు కలవు . కావున కృష్ణ తులసిని వాడవలెను . రామ తులసిలో ఔషధ గుణాలు కొద్దిగా తక్కువగా వున్నాయి .

జామ ఆకులతో మేలు... జామ ఆకుల టీ తాగితే...

రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి తెలుసా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడేవారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.

రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే..

హైటెక్ జీవన విధానంలో లేట్‌నైట్‌ డిన్నర్‌ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే, రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. పైగా, రాత్రి వేళల్లో తొందరగా తినే వారిలో శక్తిస్థాయి పెరిగి.. పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తింటే లేని రోగాలనుకొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. పగటి వేళ జీవక్రియ వేగంగా జరుగుతుంది. రాత్రివేళ జీవక్రియ రేటు తగ్గుతుంది. వైద్యనిపుణుల సూచన ప్రకారం రాత్రి ఆరు గంటలకే భోజనం చేస్తే ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదనీ, లేట్‌ నైట్‌ పనిచేసేవారు, నైట్‌ షిఫ్ట్స్‌లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు 8 లోపే భోజనం చేయాలని చెపుతున్నారు. అయితే, రాత్రిపూట తినే ఆహారం లైట్‌గా ఉండాలనీ, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌, నూడుల్స్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ రాత్రిపూట తీసుకుంటే అనారోగ్య సమస్యలను అంతా ఫాస్ట్‌గా తెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే భోజనం చేశాక పది నిమిషాల పాటు వాకింగ్ చేస్తే జీవక్రియ వేగం పెరుగుతుందని చెపుతున్నారు

మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తప్పనిసరి...

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్‌ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి కొబ్బరి నీళ్ళలో కలిపి తాగితే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలు నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. గ్లాసుడు నీళ్ళలో సబ్జా గింజల గుజ్జు వేసి మూడు, నాలుగుసార్లు తాగితే మంచి ఫలితం. వీటి గుజ్జును పైనాపిల్, యాపిల్ జ్యూస్‌లలో కలిపి పిల్లల చేత తాగిస్తే శరీరంలో వేడి తగ్గిపోతుంది. అదే ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది. మహిళలు బరువు తగ్గాలనుకుంటే సబ్జాను నానబెట్టిన నీటిని తాగాలి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలు ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది

కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలంటే... వంకాయ తినండి.

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు వంకాయలు తినండి. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా కూడా వంకాయ పనిచేస్తుంది. అలాగే రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఒక్క టమాటాకే ఉంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి టమాటాలు ఎంతో మేలుచేస్తాయి. టమాటాలతో బరువు తగ్గడంతోపాటు స్థూలకాయం కూడా బాగా తగ్గుతుంది. దోసకాయతో కూడిన ఆహారం ఒంటికి ఎంతో చలువ. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది. వర్షాకాలంలో మాంసాహారం కంటే శాకాహారం ఎక్కువగా తీసుకుంటే పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి. అధిక విటమిన్లతో కూడిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినరల్స్ విటమిన్లు కార్బొహైడ్రైట్‌లు ఉన్న పోషకాహారం ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఏ విటమిన్ కోసం క్యారెట్ బి విటమిన్ కోసం సోయాబిన్, సీ విటమిన్‌కు టమాటా, డీ విటమిన్‌కు వెన్న ఈ విటమిన్ కోసం ఆకుకూరలు, కూరగాయలు కె విటమిన్ కోసం బంగాళాదుంపలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తెల్ల జుట్టు సమస్య

ఐరన్ లోపం,మెలనిన్ లోపం,పోషణ లోపం,కాలుష్యం,సల్ఫర్ డయాక్సైడ్,సోడా ఎక్కువ తీసుకోవడం,ఆహారపానీయాలలో విషపదార్థాలు,జన్యులోపాల వలన తెల్లజుట్టు చిన్నవయసులోనే వస్తుంది. అందుకే మందులు కూడా పూర్తిగా పని చేయవు. కానీ,కొంతమేర పని చేస్తాయి. కానీ,జన్యులోపమైతే ఫలితాలేమీ వుండకపోవచ్చు. 1)ఆర్గానిక్ ఉత్పత్తులు తినాలి. 2)రోజూ బెల్లం,నువ్వులు,క్యారెట్,చెర్రీ తినాలి. 3)వారానికి ఒకరోజు బీట్రూట్ తినాలి. 4)తలకు కేశపోషిణీ తైలం వారానికి ఒకసారి పూయాలి.వారానికి రెండు సార్ల కన్నా ఎక్కువ వద్దు. 5)శిరోజరక్షాచూర్ణానికి మజ్జిగ కలిపి నెలలో ఒకసారి తలకు ప్యాక్ పెట్టుకోవాలి. 6)సునీల చూర్ణానికి మజ్జిగ కలిపి నెలలో ఒకసారి తలకు ప్యాక్ పెట్టుకోవాలి. 7)మధ్యలో మామూలు నూనె వాడుకోవచ్చు. 8)తలస్నానం చేసినప్పుడల్లా కేశధాళిణీ చూర్ణంతో తలస్నానం చేయాలి. ఇది శీకాయలా పని చేస్తుంది. కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. కృత్రిమ రంగులు,బ్లాక్ హెన్నా వాడవద్దు. జుట్టు,చర్మం సంగతి ఎలా వున్నా ఇందులోని రసాయనాలు మనం వాడే చాలా రకాల అలోపతి మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తాయని,కొన్ని రకాల మందులు వాడినపుడు శరీరంలో చెడు ప్రభావాలు కలిగిస్తాయని చెబుతారు. షాంపూలు వాడవద్దు. బజారులో దొరికే వాటిలో ఆయుర్వేదం పేరు మాత్రమే,వెనకల మీరు చూస్తే అవన్ని ఆయుర్వేదం మాటున సాగే ప్రమాదకరమైన రసాయనాల వ్యాపారాలని అర్థమౌతుంది.

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...