14, ఆగస్టు 2017, సోమవారం

పిల్లలకు జలుబు దగ్గు రాకుండా ఉండేందుకు చేయవలసిన చిట్కాలు

చాలా మంది చిన్న పిల్లలకు వర్శాకాల ప్రారంభ సమయం లోనే తరచుగా జలుబు, దగ్గు వంటి అంటు వ్యాదులు వస్తుంటాయి. ఇక చల్లని శరిరతత్వం గల వారయితే చెప్పనవసరం లేదు. ఇటువంటి వ్యాదులు పిల్లలకి రాక ముందే తగిన ముందుజాగ్రతల ద్వారా బిడ్డలను కాపాడుకునే దివ్య మార్గాలు మీ ఇంట్లోనే, మీ చేతిలోనే పుష్కలంగా ఉన్నాయి. వాటిని అనుసరించి రాబోయే రోగాలకు అడ్డు కట్ట వేయండి.


మన ఇంట్లోనే ఉన్న తులషకులు 50 గ్రాములు, అదే విధంగా మిరియాలు 2౦ గ్రాములు, మంచి అల్లం రసం 50 గ్రాములు, తీసుకో. ఈ మూడింటిని శుబ్రమయిన రోటిలో వేసి, మేతగా, ముద్దలాగా అయ్యేవరకు ఓపికగా నూరాలి. ఈ ముద్దను తీసి శనగ గింజలంత మోతాదుగా గోలీలు కట్టి, ఒక పళ్ళెంలో వేసి, ఆ పళ్లాన్ని నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టాలి. మూడు నాలుగు రోజులకి ఆ గోలిల్లోని నీరంతా ఇగిరిపోయి గోలీలు ఎండిపోయి బాగా గట్టి పడుతాయి. ఈ గోలీలను ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకోనండి.

దీనిలో వదిన ప్రతి పదార్థం మన ఆహారంగా తీసుకునీదే తప్ప వేరే కాదు. మీ బిడ్డలను మీరే కాపాడుకోగల అమృత సంజీవని వంటి ఆహార ఔషదంఇదే. రూజు ఒక్క గోలిని తీసుక్నో చనుపాలలో గాని, లేక తేనెతో కలిపి కాని, లేక మంచినీటితో కాని పిల్లల చేత సేవింప చేయాలి.

ఈ గోలీలను సేవించడం వాళ్ళ బిడ్డలకు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే తగ్గిపోతాయి. లేకుంటే రాకుండా ఉంటాయి. అన్తీ కాకుండా, ఆహరం బాగా జీర్ణం అవుతుంది. బిడ్డలకు రక్త శుద్ధి జరుగుతుంది. ఏ చర్మ వ్యాదులు కూడా పిల్లలకు సోకకుండా ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ మాత్రలను మీరు తయారుచేసుకోవడానికి అయ్యే ఖర్చు కూడా 20 రూపాయలు మాత్రమే. దీనివల్ల కలిగే ప్రయోజనం చాల గొప్పదని చెప్పొచు.

ఆరోగ్యమస్తు !

పైల్స్ తో బాధ పడుతున్నారా?


చిట్కా నం. 1

ఈ సమస్య పరిష్కరానికి ఎక్కడికో వేల్లనవసరం లేదు. మన ఇంటి చుట్టూ పెరిగే బంతి చెట్టు మీ సమస్యని దూరం చేస్తుంది. బంతి చెట్టు ఆకులు 60  గ్రాములు, మిరియాలు 1౦ గ్రాములు కలిపి మెత్తగా ముద్దలాగా నూరి, రేగి గింజలంత మాత్రలుగా చేసి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. రెండు పూటలా పూటకు ఒక మాత్ర మంచినీటితో వేసుకోండి. ఎన్ని మందులు వదిన తగ్గని మొలల రోగం మీ పెరటి చెట్టుతో, మీ వంటింటి దినుసులతో పరిష్కారం అవుతుంది.

తీవ్రమైన నడుము నొప్పికి వంటింటి వైద్యం

  తీవ్రమైన నడుము నొప్పికి వంటింటి వైద్యం.



మన వంటింట్లో ఉండే వామును తీసుకొని  డోర గా  వేయించి  దంచి పొడి చేసికొని, దీనితో సమానంగా  కండచక్కర పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి . రోజు రెండు పూటలా ఒక టీ స్పూను పొడి, ఒక కప్పు వేడి పాలలో కలిపి తాగుతుండండి.
                                   
                                    





దీనితో పాటు ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్లు  పోసి, అందులో అయిదు  చెంచాల పసుపు, అయిదు జిల్లేడాకులు  నలగొట్టి వేసి, పది నిముషాల తరువాత పటు బాగా మరిగించి దించి, అందులో బట్ట ముంచి, వట్టిగా పిండి, దానితో నడుము పైన కాపడం పెడుతుండండి. క్రమంగా నడుము నొప్పి సమస్య  తీరిపోతుంది.




Video



నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...