15, ఆగస్టు 2018, బుధవారం

చుండ్రు నివారణ

వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడి బారి పోతుంది . పెదవులు , మడమలూ పగలుతూ ఉంటాయి . తలలో చుండ్రు వచ్చును . *గృహ చికిత్సలు* : --- 1.గోరు వెచ్చని నువ్వల నూనెను తలకు + శరీరమంతటికి మర్దన ( మాలీష్ ) చేయవలెను. 1 గంట తర్వాత పెసర పిండీ ( Green Gram Powder ) తో స్నానం చేయ వలెను . 2 .2 or 3 spoon ల మెంతులను1 గ్లాసు నీళ్ళలో రాత్రి నాన బెట్ట వలెను . ఉదయం మెంతులలో + పెరుగు కలుపుతూ పేస్ట్ తయారు చేసుకొన వలెను . నువ్వుల నూనె ను తలకు ( scalp ) కి పట్టిస్తూ 10 నిమిషాల పాటు మర్ధన చేయాలి . ఆ తర్వాత పేష్ట్ ని తలకు బాగా పట్టించాలి . 20 - 30 నిమిషాల తర్వాత *పెసర పిండి ( green gram powder )* తో స్నానం చెయ్యాలి .. గమనిక : --- 1. చుండ్రు కొద్దిగా వున్న వారు , మొదటి పద్ధతి ప్రకారము వారానికి 2 లేక 3 సార్లు చేయడం వలన శరీరంలో వున్న వాతము తగ్గి , పగిలిన పెదవులు , మడమలూ మరియు చుండ్రు తగ్గి పోవును . 2. చుండ్రు ఎక్కువగా వున్న వారు 2 వ పద్దతి ప్రకారము చేయ వలెను. 1 వారము ప్రతి రోజు చేయ వలెను . చుండ్రు తగ్గని యెడల మరల ఇంకొక వారము ప్రతి రోజు చేయ వలెను . అప్పటికి చుండ్రు పూర్తిగా తగ్గి పోవును . వరుసగా 2 వారాలు చేయ లేని వారు . 1 వారము చేసిన తర్వత 1 వారము Gap ఇచ్చి మరల 1 వారము ప్రతి రోజు చెయ్యండి . పూర్తిగా తగ్గే వరకు చెయ్యండి. 3 . చుండ్రు పూర్తిగా తగ్గిన తర్వాత మొదటి పద్ధతి ప్రకారము వారములో ఒక సారి ఖచ్చితంగా చెయ్యండి . పై పద్దతులు ఆచరించన యెడల , మీ వెంట్రుకలు SILKY గా తయారవును . క్రొత్త వెంట్రుకలు వచ్చును . స్వదేశి చికిత్స* *తులసి ( Holy Basil )* హిందూ మతంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి , పూజా విధానాలు ఉన్నాయి . తులసి తీర్ధం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్ధానాన్ని కల్గి ఉంది . దీనిని సర్వరోగ నివారణిగా భావిస్తారు . వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేధంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడు తున్నది . తులసిని చాలా గృహ చికిత్సలలో కూడా వాడుతారు . # తులసిలో ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ , కొంచెం లేత రంగులో ఉండే జాతిని రామ తులసి అనీ అంటారు . *గృహ చికిత్సలు* .... తులసిని వాడే విధానము.. ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం 1 spoon త్రాగవలెను . 10 --15 కృష్ణ తులసి ఆకులను పేష్ట్ లాగా చేసి , రసం తీయవలెను , కొద్దిగా వేడి చేసి + బెల్లం లేక తేనెను కలిపి 1 spoon మోతాదులో తీసుకొనవలెను . ( Or ) 15 -- 20 కృష్ణ తులసి ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి ,1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించి + బెల్లంని కలిపి త్రాగవలెను . *ఫలితములు* ..... 1. Typhoid Fever , Viral Fever , Bacterial Fever మరియు ఎటువంటి జ్వరమైన తగ్గిపోవును . 2. స్త్రీ లలో వచ్చు leucorrhea ( white discharge ) తగ్గిపోవును . (బెల్లం బదులు కండ చెక్కరను కలిపి తీసుకొనవలెను ). 3. వృద్దులలో వచ్ఛు బహుమూత్ర రోగం , కొద్ది , కొద్దిగా వచ్చు మూత్ర రోగాలు తగ్గిపోవును . 4 . స్త్రీలకు నెలసరిలో వచ్ఛే అధిక ఋతుస్రావంని అరికట్టుతుంది . 5 . పిల్లల కడుపులో వుండే నులి పురుగులు తొలగిపోవును . # *DANDRUFF*... కృష్ణ తులసి ఆకుల రసంని తల ( Scalp ) కు పట్టించి , 1 గంట తర్వాత తలస్నానం చేయవలెను . త్వరలోనే DANDRUFF తగ్గిపోవును . *WOUNDS* ... శరీరంలో వ్రణం ఎక్కడైనా వున్నయెడల కృష్ణ తులసి ఆకుల పేష్ట్ ను పూయవలెను . త్వరలో తగ్గిపోవును . *గమనిక* ... కృష్ణ తులసి లో ఎక్కువ ఔషధ గుణాలు కలవు . కావున కృష్ణ తులసిని వాడవలెను . రామ తులసిలో ఔషధ గుణాలు కొద్దిగా తక్కువగా వున్నాయి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...