15, ఆగస్టు 2018, బుధవారం

తెల్ల జుట్టు సమస్య

ఐరన్ లోపం,మెలనిన్ లోపం,పోషణ లోపం,కాలుష్యం,సల్ఫర్ డయాక్సైడ్,సోడా ఎక్కువ తీసుకోవడం,ఆహారపానీయాలలో విషపదార్థాలు,జన్యులోపాల వలన తెల్లజుట్టు చిన్నవయసులోనే వస్తుంది. అందుకే మందులు కూడా పూర్తిగా పని చేయవు. కానీ,కొంతమేర పని చేస్తాయి. కానీ,జన్యులోపమైతే ఫలితాలేమీ వుండకపోవచ్చు. 1)ఆర్గానిక్ ఉత్పత్తులు తినాలి. 2)రోజూ బెల్లం,నువ్వులు,క్యారెట్,చెర్రీ తినాలి. 3)వారానికి ఒకరోజు బీట్రూట్ తినాలి. 4)తలకు కేశపోషిణీ తైలం వారానికి ఒకసారి పూయాలి.వారానికి రెండు సార్ల కన్నా ఎక్కువ వద్దు. 5)శిరోజరక్షాచూర్ణానికి మజ్జిగ కలిపి నెలలో ఒకసారి తలకు ప్యాక్ పెట్టుకోవాలి. 6)సునీల చూర్ణానికి మజ్జిగ కలిపి నెలలో ఒకసారి తలకు ప్యాక్ పెట్టుకోవాలి. 7)మధ్యలో మామూలు నూనె వాడుకోవచ్చు. 8)తలస్నానం చేసినప్పుడల్లా కేశధాళిణీ చూర్ణంతో తలస్నానం చేయాలి. ఇది శీకాయలా పని చేస్తుంది. కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. కృత్రిమ రంగులు,బ్లాక్ హెన్నా వాడవద్దు. జుట్టు,చర్మం సంగతి ఎలా వున్నా ఇందులోని రసాయనాలు మనం వాడే చాలా రకాల అలోపతి మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తాయని,కొన్ని రకాల మందులు వాడినపుడు శరీరంలో చెడు ప్రభావాలు కలిగిస్తాయని చెబుతారు. షాంపూలు వాడవద్దు. బజారులో దొరికే వాటిలో ఆయుర్వేదం పేరు మాత్రమే,వెనకల మీరు చూస్తే అవన్ని ఆయుర్వేదం మాటున సాగే ప్రమాదకరమైన రసాయనాల వ్యాపారాలని అర్థమౌతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...