15, ఆగస్టు 2018, బుధవారం

జుట్టు రాలటం అరికట్టాలంటే

వేరే ఆరోగ్య సమస్య లేకుండా హెయిర్ ఫాల్ వుందంటే ఆడవారికి,మగవారికి కారణాలు ఒకటే కాదు. మగవారిలో గుండె వ్యాధులను నివారించే జన్యువు స్విచాన్ మోడ్ లో వుంటే అందుకు పార్శ్వఫలితం జుట్టు రాలడం,బట్టతల. ఆడవారిలో చలామందికి ఆ జన్యువు స్విచాఫ్ మోడ్ లోనే వుంటుంది.కాబట్టి వారిలో బట్టతల చాలా అరుదు. ఆడవారిలో హార్మోన్ సమస్యలు కూడా ఓ కారణం. నేను చెప్పబోయే చికిత్స ఈ లక్షణాలు,సమస్య వున్న వారికి తక్కువగా పని చేస్తుంది. మిగిలినవారికి చాలా బాగా పని చేస్తుంది. వారంలో కనీసం ఒకసారి కేశపోషిణీ తైలం వెంట్రుకలకు కుదుళ్ళు తడిసేలా పట్టించండి! కేవలం ఒక గంట తర్వాత కేశధాళినీ చూర్ణంతో తలస్నానం చేయండి! గంట కన్నా ఎక్కువ సేపు వుండకండి,ఇది తలపై వున్న చర్మంలో వేడిని పెంచుతుంది. మిగిలిన రోజులు మామూలు నూనె వాడుకోండి! ఇలా చేస్తుంటే నెల తర్వాత మీకు ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా కొనసాగిస్తే మంచిది. అయితే,కేశపోషిణీ తైలం దొరకనివారు కేశపోషిణీ చూర్ణం తెచ్చుకుని ఇంట్లోనే ఆ తైలం చేసుకోవచ్చు. (కేశపోషిణీ చూర్ణం 10 చెంచాలు,కొబ్బరి నూనె,ఆముదం,వేపనూనె,నువ్వుల నూనె ఒక్కొక్కటి ఒక గ్లాసు,ఇనప పాత్రలో చిన్న మంటపై వేడి చేయాలి. నూనె దాదాపుగా సగమయ్యాక,చల్లార్చుకుని వడగట్టుకుని,గాజు సీసాలో నిలువ చేసి వాడుకోవాలి. దాదాపు 98% సక్సెస్ రేట్ వుంది. అంటే వంద మందిలో 98 మందికి పని చేసిందన్న మాట! జుట్టు కొద్దిగా రాలినట్టు,కొద్దిగా దురద అయినట్టు కొందరిలో అనిపిస్తుంది. నిజానికి జుట్టు రాలినా,ఆ కుదురులో రిపేర్ జరిగి మళ్ళీ రాలడం తగ్గుతుంది. దురద కుదుళ్ళ రిపేరి వలన కలుగుతుంది. అయితే మందారం ఆకు,పువ్వు సరిపడనివారికి ఈ చికిత్స సరిపడదు. అంతేకాక బెల్లం,గుడ్డు,ఆవునెయ్యి,క్యారెట్,పాలు ఆహారంలో బాగా తీసుకోవాలి. 8/13/18, 2:58 PM - ‪+91 92937 30904‬: గమనిక:కేశపోషిణీ తైలం,కేశవర్థినీ తైలం ఒకటి కావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...