15, ఆగస్టు 2018, బుధవారం

మన ఆరోగ్యం

🍏 నిత్యం మనం చేసుకునే ఏ వంటకమైనా.. అందులో ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేకపోతే ఏ కూరను తినలేం. అయితే ఉప్పు ఎక్కువైతే ముప్పు తప్పదు. హైబీపీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక బీపీ రోగులు అయితే ఉప్పును చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది. కానీ.. ఇన్ని ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా మనం సైంధవ లవణం వాడితే దాంతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పైగా మనం నిత్యం వాడే ఉప్పు కన్నా సైంధవ లవణం ఎంతో తక్కువగా అవసరం అవుతుంది. అంటే.. ⓷ టీస్పూన్ల ఉప్పు వాడే బదులు ⓶ టీస్పూన్ల సైంధవ లవణం వాడితే చాలన్నమాట. ఈ క్రమంలోనే సైంధవ లవణం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  💦 సైంధవ లవణాన్ని స్వచ్ఛమైన ఉప్పు అంటారు. ఇందులో ⓼⓸ రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ తదితర పోషకాలు సైంధవ లవణంలో ఉంటాయి. ఇవి మనకు చక్కని పోషణను అందిస్తాయి. 💦 సైంధవ లవణాన్ని తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దేహానికి శక్తినిస్తుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఆస్తమా, హైబీపీ, మధుమేహం, దంత సమస్యలు ఉన్నవారు సైంధవ లవణం వాడితే ఫలితం ఉంటుంది.  💦 ఎముకలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ సమస్యలను నయం చేయడంలో సైంధవ లవణం బాగా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా సైంధవ లవణం వేస్తే శరీరం నుంచి దుర్గంధం వెలువడకుండా ఉంటుంది.  💦 థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలి. అలాగే కీళ్లనొప్పులకు, నపుంసకత్వ సమస్యకు కూడా ఇది పనిచేస్తుంది.  💦 వాము, సైంధవ లవణం కలిపి తింటే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎండు ద్రాక్షను నెయ్యిలో వేయించి సైంధవ లవణం కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  💦 భోజనం తరువాత మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణ సమస్య పోతుంది. జీలకర్ర, సైంధవ లవణం కలిపి తింటే వాంతులు తగ్గుతాయి. సైంధవ లవణం, పసుపు, శొంఠి పొడి కలిపి అన్నంలో తింటే ఆకలి పెరుగుతుంది.  💦 అల్లం రసం, సైంధవ లవణం కలిపి భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది. తులసి ఆకుల కషాయంలో సైంధవ లవణం కలిపి తాగితే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి తాగితే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయి. 💦 తులసి ఆకుల పొడి, సైంధవ లవణం కలిపి దంతాలను తోముకుంటే దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసన సమస్యలు దూరమవుతాయి. హైబీపీ ఉన్న వారు స్నానం చేసే నీటిలో సైంధవ లవణం వేసి స్నానం చేయాలి. అలాగే ఒక గ్లాస్ నీటిలో సైంధవ లవణం కలుపుకుని తాగాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...