15, ఆగస్టు 2018, బుధవారం

తెలుపు రంగు ఓ వ్యామోహం!

క్రింది మూడు పనులు మండలం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే తప్పక ఫలితం వుంటుంది. 1)కడిగిన పచ్చి తువరకం ఆకులు 2 తులాలు,దంచుకున్న పసుపు కొమ్ముల పొడి 1 తులం,కస్తూరి పసుపు ఒక చిటికెడు,సహజమైనగంధం పొడి ఒక చిటెకెడు వేసి రోట్లో మెత్తగా నూరి ఒళ్ళంతా పూసుకోవాలి!మూడు నాలుగు రోజులు బాగా చిమచిమలు రావచ్చు,కానీ,భయపడవద్దు,అలవాటయే వరకు ఇబ్బందే! మరీ బొబ్బలు వస్తే వాడవద్దు! ముందుగా చేతికో,కాలికో పట్టించుకుని ప్రయోగించండి!ఒకరోజులోపలనే దుష్ప్రభావాలేమైనా వుంటే తెలుస్తాయి. అలాంటపుడు తువరకం బదులుగా లేత కానుగ ఆకులు వాడవచ్చు. కానీ ఫలితం తక్కువ! ఆరిపోయేవరకు అలాగే వుండి,వేడి నీటితో వొళ్ళు రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి.సబ్బు వాడవద్దు. 2)సబ్బు బదులుగా ఓ వుండ వాడాలి. (చంద్రకాంతం చెట్టు బెరడు పొడి ఒక తులం,తేనెపట్టు మైనం 5 తులాలు,రెండు నిమ్మతైలం ఓ గిన్నెలో వేసి,అతి సన్నని మంటపై లేదా వుడుకుతున్న నీటిపై వుంచి, బాగా కలిసేదాకా కలియబెట్టాలి. ఆపైన ఓ చిన్న గిన్నెలో నువ్వుల నూనె రాసి, ఈ ద్రవమిశ్రమాన్ని అందులో పోయాలి.ఇది దాదాపుగా ఒక గంట తర్వాత గట్టిపడుతుంది. ఆ పైన కత్తి సాయంతో తొలగిస్తే గట్టి వుండ తయారవుతుంది.) ఒకటోది ఎప్పటికప్పుడు చేసుకోవాలి,కావలసినవి తెలుగునాట ప్రతి వీధిలోనూ దొరుకుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...