15, ఆగస్టు 2018, బుధవారం

బ్యాక్ పెయిన్ | నడుము నొప్పి

వికారం కడుపు నొప్పి బహిష్టు నొప్పి అన్నింటికి పురుషులైనా,స్త్రీలైనా మైగ్రెయిన్ ప్రధాన కారణం. అయితే బ్యాక్ పెయిన్ మాత్రమే వుంటే అది వేరే విషయం. మైగ్రెయిన్ తగ్గితే అవీ తగ్గుతాయి. ఆయుర్వేదానికి,ఈ విషయంలో మిగతా విధానాలతో కొన్ని విభేదాలున్నాయి. అలోపతి అసంతృప్తి దీనికి కారణమంటుంది. కానీ,ఆయుర్వేదం వేరే కారణాలు చెప్పింది. ఆయుర్వేదం ప్రకారం చెబుతున్నాను. పీయూషగ్రంథి(Pituitary Gland),ఉపశీర్షం(Hypothalamus)లను ఇబ్బంది పెట్టేవన్నీ మైగ్రెయిన్ తద్వారా అనుబంధ సమస్యలు కలిగిస్తాయి. అందుకే మందు ప్రభావం కన్నా రోగి ప్రవర్తన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మందు కేవలం అందుకు చేయూతనిస్తుంది.అందుకే అవేవో తెలుసుకుందాం! 1)అన్ని రకాల మద్యాలు(రెడ్ వైన్/బ్రీజర్ కూడా) 2)పొగాకు 3)మానసిక ఒత్తిడి 4)పాలీగమీ(ఒకరి కన్నా ఎక్కువ మందితో సంభోగం) 5)క్షోభ్యత చూపే వాసనలు(సరిపడని వాసనలు) 6)అందనివాటికి అరులు చాచడం 7)ఎక్కువ మసాలా,ఎక్కువ మాంసం,హింసా ప్రవృత్తి,కోపం 8)శరీర స్థాయిని మించిన కష్టం 9)సరిగా నిద్ర లేకపోవడం 10)శారీరక వ్యామోహం లేకపోవడం ఈ పది కారణాలు సమస్య రావడానికి,పెరగడానికి కారణాలు. మనిషి శరీరధర్మాన్ని బట్టి వుంటుంది. ఇవి తగ్గితే సమస్య తగ్గుతుంది. స్త్రీలకు: 1)పరగడుపున పసుపు,జిలకర చిటికెడు చొప్పున,నిమ్మకాయ సగం పిండి గ్లాసుడు నీరు ప్రతిరోజు తాగాలి. 2)రాత్రి భోజనం తర్వాత గ్లాసు చల్లని నీటిలో చిటికెడు సత్తాక చూర్ణం కలిపి తాగాలి. 3)పడుకోబోయే ముందు గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు,చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. 4)బహిష్టు రోజులలో ప్యతి రోజు కొంత కలబంద రసం తాగాలి. 5)వారానికి ఒకసారి శరీరం మొత్తానికి(తల తప్ప) కొమ్ముపసుపు,కస్తూరి పసుపు సమపాళ్ళలో కలిపి,నీటిని కలిపి రాసుకుని,ఆరాక స్నానం చేయాలి. కారణం తెలీదు కానీ,ఈ పైపూత కూడా ఆడవారి విషయాలలో పని చేస్తుందని తేలింది. 6)నొప్పిగా వున్నపుడు ఒకేసారి మింగే మందులు వాడకుండా ఓపిక పట్టాలి. పైపూత మందులు వాడాలి. తప్పనిసరి ఐతేనే నొప్పినివారిణి మందులు మింగాలి. నలభై రోజుల తర్వాత ఫలితం కనిపిస్తుంది. పురుషులకు:4,5 తప్ప మిగిలినవన్ని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...